![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన వారందరు ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు. అయితే బయట వాళ్ళు సినిమాలలో, సీరియల్స్ లో నటిస్తుంటే.. వారికి ఇచ్చే రెమ్యునరేషన్ బట్టి బిగ్ బాస్ హౌస్ లో ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా పల్టా థీమ్ తో మొదలవ్వగా అందులో మొదటి కంటెస్టెంట్ గా ప్రియాంక జైన్ ఎంట్రీ ఇచ్చింది.
ప్రియాంక జైన్ మొత్తంగా నూట అయిదు రోజులు హౌస్ లో ఉంది. తనున్నన్ని రోజుల్లో ఎక్కువగా కిచెన్ లో ఉంది. ప్రియాంక జైన్ , శివ్ గత కొన్నేళ్ళుగా సహజీవనం సాగిస్తున్నారు. వారి ప్రేమ పెళ్ళికి నెటిజన్లంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఆడపులిలా చెలరేగి టాప్ లో నిలిచింది ప్రియాంక. హౌస్ లో ఉన్నన్ని రోజులు కిచెన్ కే పరితమైన ఈ బ్యూటీ.. అమర్ దీప్, శోభాశెట్టిలతో కలిసి గ్యాంగ్ నడిపించింది. బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళు ముగ్గురు చేసినన్ని ఫౌల్స్ ఎవరూ చేయలేదు. అయితే ఆటతీరు, మాటతీరు పక్కన పెడితే.. గ్లామర్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. అందుకే ఈ పొట్టి పిల్లకి గట్టి ఫాలోయింగ్ ఏర్పడింది. హౌస్ నుండి బయటకొచ్చాక శివ్ తో కలిసి రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూనే ఉంది.
జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ప్రియాంక. బిగ్ బాస్ హౌస్ లో తన పర్ఫామెన్స్ తో మెప్పించి.. టాప్-5 లో ఒకరిగా ఉన్న ప్రియాంక జైన్. అయిదవ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది. శివ్ కుమార్, ప్రియాంక జైన్ ఇద్దరు కలిసి ' మౌనరాగం' సీరియల్ నుండి సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి నెవెర్ ఎండింగ్ టేల్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేస్తారు. బిబి ఉత్సవంలో వీళ్ళ హంగామాతో మారుమ్రోగుతుంది. మొన్నటికి మొన్న బేల్ పూరితో శివ్ ప్రపోజ్ చేయగా అది ఫుల్ వైరల్ గా మారింది. ఇప్పుడేమో తను బిగ్ బాస్ హౌస్ లో ఎంత సంపాదించిందో ఓ వ్లాగ్ లో చెప్పుకొచ్చింది.
![]() |
![]() |